Banswada | బాన్సువాడ, జూన్ 15 : బాన్సువాడ డివిజన్ లో సమస్యల పై వచ్చే ప్రతీఒక్కరి సమస్యలను సత్వరంగా పరిష్కరించేలా కృషిచేస్తామని ఆర్డీవో ఎం రవీందర్ రెడ్డి సూచించారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సమస్యల వచ్చేవారి వినతులను తీసుకున్నారు. వెంటనే అధికారులతో పరిష్కరించేలా కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఆర్ఎంవో డాక్టర్ సుజాత, నీటిపారుదల శాఖ ఏఈ నితిన్, ట్రాన్స్ కో టెక్నికల్ ఏఈ ప్రశాంత్, మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.