కంఠేశ్వర్, ఏప్రిల్ 2: యాసంగి వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేకపోతే రైతు ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ జిల్లాలో 26వేల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, కనీసం బోనస్తోనైనా బాధిత రైతులకు ఊరట లభిస్తుందనుకుంటే వారి ఆశలు అడియాశలయ్యాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం ఎకరానికి రూ.25వేలు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు. జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మేయర్ నీతూకిరణ్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, నాయకులు సిర్పరాజు, సుజిత్‌సింగ్, సత్యప్రకాశ్, రవిచందర్ పాల్గొన్నారు.