బాన్సువాడ : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను (BJP Candidates ) గెలిపిస్తే శాసన మండలిలలో కాంగ్రెస్ ప్రభుత్వాని నిలదీస్తామని బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే (Srinivas Garge) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం, ప్రైవేట్ కళాశాలల గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు రూ 7, 500 కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులను, యూపీఎస్సీ, గ్రూప్ వన్, బ్యాకింగ్ లాంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఏఐ ఆప్ ద్వారా ఇంటి వద్దనే కోచింగ్ తీసుకునే వసతిని కల్పిస్తామని అన్నారు. సెంట్రల్ నిధులతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి చేస్తామని వివరించారు. బీజేపీ నాయకులు దావుగారి డాకయ్య, అర్సపల్లి సాయి రెడ్డి, చీకట్ల రాజు, రాజాసింగ్, వినోద్, విశాల్, అజయ్ పాల్గొన్నారు.