Jeevan Reddy | ఆర్మూరు : ఆర్మూర్ పట్టణంలోని నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిర్మించిన రైతు బజార్ ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి శనివారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజార్ లో షట్టర్లలో విచ్ఛలవిడిగా డబ్బులు మున్సిపల్ అధికారులు, టై బజార్ వారు డబ్బులు వసూలు చేస్తూ కూరగాయలు అమ్మే వారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారని ఆరోపించారు.
కూరగాయలు అమ్మే వారికి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతు బజార్లో సమస్యలు ఉన్నాయని సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని కూరగాయలు అమ్మే వారితో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హజీం, లతీఫ్, పూజ నరేందర్, పోలా సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.