ఎల్లారెడ్డి రూరల్ : వేసవికాలంలో ప్రజలకు ముఖ్యంగా తాగునీటికి (Drinking Water) ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సూచించారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
గత వేసవికాలంలో తీసుకున్న చర్యలను వార్డుల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వార్డులలో తాగునీటి పరిస్థితిపై ఆరా తీశారు. తాగునీటి సమస్య వస్తే వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలన్నారు. బోర్లు(Bores) ఎండిపోతే సమీపంలోని బోర్లను ఎంగేజ్ చేసుకుని ప్రజలకు నీటిని అందించాలని ఆదేశించారు.
మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్నుల ( Taxes ) వసూళ్ల గురించి వాకాబు చేశారు. వందశాతం పన్నులను వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమృత్ స్కీంలో భాగంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ల పనుల గురించి మాట్లాడారు. సమావేశంలో ఆర్డీవో మన్నే ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, మేనేజర్ వాసంతి, వార్డ్ ఆఫీసర్లు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.