వినాయక్‌నగర్, మార్చి 15: నగర శివారులోని దుబ్బ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ-1) అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 కార్యక్రమం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.162.81 కోట్లు, తాగునీటి సరఫరాకు రూ. 217 కోట్లు విడుదల చేశాయని తెలిపారు.
పనులు టెండర్ స్థాయిలో ఉన్నాయని, త్వరగా పూర్తిచేయించి ఏడాదిలోగా నగర ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ తిరుపతి, డీఈఈ నగేశ్ రెడ్డి, ఏఈ యోగేశ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.