ఎల్లారెడ్డి రూరల్, జూన్ 26: రెండేండ్ల మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారి వియాన్ వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌లో చోటు సాధించాడు. భారత దేశంలోని 29 రాష్ర్టాల రాజధానుల పేర్లను కేవలం 41 సెకండ్లలో చెప్పడంతో ఈ ఘనత అతడి సొంతమైంది.
నిర్వాహకులు 15 రోజుల క్రితం ఆన్లైన్ టెస్ట్ నిర్వహించగా.. మంగళవారం ఫలితాలు వెల్లడించి, ధ్రువపత్రాలను అందజేశారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన రెంజర్లవార్ అమూల్య రవికుమా ర్ దంపతుల కుమారుడైన వియాన్.. చిన్నతనంలోనే రికార్డు సాధించడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. వియాన్ తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.