Nizamabad | కంటేశ్వర్, సెప్టెంబర్ 15 : ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల లో పూర్వ విద్యార్థుల సంఘం , ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ సాయి చైతన్య విచ్చేసి విద్యార్థులు, రిటైర్డ్ ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఇంజనీరింగ్ విభాగంలో వినూత్నమైనటువంటి సేవలను దేశానికి అందించిన మహనీయుడని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, కష్టపడి చదివి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అనంతరం విశ్రాంత ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. ఈ ప్రిన్సిపాల్ పీ భారతి, ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, అధ్యక్షుడు కేఎల్వి రమణ , సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, వినోద్, మోహన్ కుమార్, బాలచందర్, బాబా శ్రీనివాస్, వై గణేష్, కళాశాల అధ్యాపకులు నాగరాజ్, నరేష్, కళాశాల అధ్యాపకులు, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.