తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా కోటగిరి మండల మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం కోటగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిష్టి బొమ్మను దహనం చేసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షుడు చిన్న మీర్జా పురం సాయన్న మాట్లాడుతూ 2024 సర్వే ప్రకారం కాకుండా 2011 ప్రకారం వర్గీకరణ చేయడం సమంజసం కాదన్నారు. వెంటనే ఈ బిల్లు ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు మీర్జా పురం చిన్న సాయన్న. కాలే సాయిలు,పాల గంగారాం,జంగం సాయిలు సుంకిని సాయిలు. మోరే జీవన్ తో పాటు తదితరులు ఉన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలోని సయ్యద్ షా ముల్తానీ భాష ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. సనాతన ఆచారం ప్రకారం వంశపారంపర్య ధర్మకర్త సయ్యద్ అర్షద్ పాష ఇంటి నుండి ఊరేగింపుగా సందల్ తీసుకువచ్చారు. అనంతరం దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు, ఖవాలీ కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో హనుమాన్ ఆలయంలో దొంగతనానికి పాల్పడి హనుమాన్ విగ్రహాన్ని మద్యం మత్తులో ధ్వంసం చేసిన ఇద్దరువ్యక్తులను వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు,స్థానిక సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన సదాశివ నగర్ పోలీసులు. నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వాసులను గుర్తించిన పోలీసులు.
వినాయక నగర్, ఫిబ్రవరి; 06-నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు గురువారం పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ నగర్ లోని కస్తూరిబా కాలనీ ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని , వారి వద్ద నుండి ఏడు సెల్ ఫోన్లు, 30,500వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సీఐ అంజయ్య సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. పట్టుబడిన పేకాటరాయులను రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
మండల కేంద్రంలో గురువారం భేటీ బచావో బేటి పడావో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రసూల్ బి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకూడదని బాల్యవివాహాలు జరగడం వల్ల కలిగే నష్టాలు చట్టరీత్యా ఉన్నటువంటి శిక్షలు, గురించి తెలియజేశారు, అలాగే లింగ నిర్ధారణ చేయడం అత్యంత క్రూరమని రహస్యంగా ఎక్కడ చేయించుకోవద్దని అలా చేస్తే చట్టరీత్య నేరమని తెలియజేస్తూ ఆడపిల్లల్ని మగ పిల్లల్ని సమానంగా విలువలతో కూడిన విద్యను సంస్కారాన్ని అలవర్చాలని డీ డబ్ల్యూ రసూల్ బి ఈ సందర్భంగా మహిళకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రొజెక్టర్ ద్వారా సినీ ఫి లిమ్స్ ద్వారా కొన్ని రకాల బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు బృణ హత్యల వల్ల ఎటువంటి బాధ ఉంటుందో ఈ కార్యక్రమాలను మహిళకు చూయించారు ఈ కార్యక్రమంలోమండలం ఎంపీడీవో విజయేందర్ రెడ్డి ఎమ్మార్వో శ్రీధర్, సిడిపిఓ భార్గవి, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ టి.రమాదేవి,ఏపీఓ ఇందిరా, హెల్త్ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్లు ఆశాలు ఏఎన్ఎంలు. సీఏలు, గర్భిణీలు బాలింతలు పిల్ల తల్లులు అత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో జాతీయ నట్టలనివారణ దినోత్సవం లో భాగంగా గ్రామంలోని వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ టీచర్లకు నట్టల నివారణ మాత్రల పంపిణీపై ప్రాథమిక ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు ఈనెల 10వ తారీఖున సోమవారం అన్ని విద్యాసంస్థలలో నట్టల నివారణకు మందులు పంపిణీ చేస్తామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ ఈ జార్జ్ సూపర్వైజర్ జానకి తదితరులు పాల్గొన్నారు.
చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని నిజామాబాద్ జిల్లా బీసీ నాయకులు చక్రపాణి కోరారు. గురువారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు టీ. చక్రపాణి మాట్లాడుతూ.. , ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీలకు 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు చేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల కోట్లతో బీసీ సంక్షేమ అభివృద్ధి కొరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, బడ్జెట్లో నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయించి ఉపాధి అభివృద్ధికై ఖర్చు చేయాలని, సబ్సిడీ రుణాలు వృత్తిదారులకు అందించాలని, బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని, అన్ని జిల్లాల్లో బీసీ భవన్ లను నిర్మించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి ప్రభుత్వానికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధా కుమార్, రమేష్ సాయి తదితరులు పాల్గొన్నారు.