వేల్పూర్, డిసెంబర్ 7: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేల్పూర్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పట్టిన నాటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే.. పథకాల కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు