కంఠేశ్వర్, నవంబర్ 21: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెచేపడుతామని హెచ్చరించారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ ఏఈ, డీఈవోకు గురువారం సమ్మె నోటీసును అందజేశారు. రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని, రానున్న 15 రోజుల్లో చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలు నిరవధిక సమ్మెకు దిగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రాజు, గౌరవ అధ్యక్షుడు ఆష్రఫ్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, ప్రధాన కార్యదర్శి కె.భూపేందర్, జిల్లా కోశాధికారి ప్రసాద్, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజు, సీఆర్పీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పవిత్రన్, పీటీఐల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, డీపీవో స్టాఫ్ పాల్గొన్నారు.