Pothangal | పోతంగల్, జనవరి 12 : పోతంగల్ మండల కేంద్రంలోనీ పీహెచ్సీలో పనిచేస్తున్న 51మంది ఆశా కార్యకర్తలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో యూనిఫామ్ చీరలను అధికారులు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కల్లూరి సంధ్య-హన్మండ్లు హాజరై యూనిఫామ్ చీరలను అందజేశారు.
అందరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కరణ్, హెల్త్ సూపర్వైజర్లు సుజాత, సావిత్రి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.