వినాయక్ నగర్ : నిజామాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి రైలు ప్రమాదంలో (Train accident) ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయరెడ్డి ( SI Sayareddy ) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ సీహెచ్ సాగర్ ఇచ్చిన సమాచారం ప్రకారం..
అర్సపల్లి రైల్వే గేటుకు నిజామాబాద్( Nizamabad ) – జానకంపేట్ (Janakampet) రైల్వే స్టేషన్స్ మధ్య గుర్తు తెలియని (50) మహిళా రైలు ఢీకొని మరణించిందన్నారు. మృతురాలికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు 8712658591 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.