Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో సంచిలో వ్యక్తి సగా భాగమైన అరమృతదేహం లభ్యమైన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని సీఎస్ఐ చర్చి సమీపంలోని చెత్త కుప్పలో చెత్త కాగితాలు సేకరించే వారికి గోనె సంచిలో నుంచి కాళ్లు కనిపించాయి.
వెంటనే వారు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గోనె సంచిని తెరిచి పరిశీలించారు. దీంతో నడుం నుంచి కాళ్ల వరకు మాత్రమే ఉన్న సగం మృతదేహం లభించింది. మిగతా తలభాగాన్ని చుట్టు ప్రాంతంలో వెతికినా లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం సగభాగమే దొరకడంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసారా..? లేక మిగతా సగ భాగం కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.