మాక్లూర్, డిసెంబర్ 2 : ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళ వారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని సింగంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒకే ఒక నామినేషన్ రావడంతో ఏకగ్రీవమైనట్లు తండావాసులు తెలిపారు. సర్పంచ్‌గా జాదవ్ శాంత, ఉప సర్పంచ్‌గా సంతోష్, ఏడుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. అధికారికంగా ప్రకటన రావల్సింది ఉన్నదని తండావాసులు తెలిపారు.
‘సంగ్యానాయక్ తండా’ పాలకవర్గం
లింగంపేట, డిసెంబర్ 2: మండలంలోని మాలోత్ సంగ్యానాయక్ తండా పంచాయతీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో తండావాసులు పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా మాలోత్ సక్రునాయక్, ఉప సర్పంచ్‌గా కాట్రోత్ స్వరూప, వార్డు సభ్యులుగా నేనావత్ శాంతి, మాలోత్ రాజు, మాలోత్ జగ్రాం, గుగ్లోత్ మంజుల, కేతావత్ సంతోష్, కోర్ర సవాయి, కోర్ర లాలీబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.