కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్(online betting ) యాప్‌నకు బలయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన దేవల సంజయ్(29) ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌నకు(app)అలవాటుపడ్డాడు.
అప్పు చేసుకుంటూ బెట్టింగ్ యాప్‌లో గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే సుమారుగా రూ. 80 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. దాంతో అప్పులు తీర్చే మార్గం కోసం ఆలోచిస్తూ ఉన్న ఇంటిని అమ్మడానికి ప్రయత్నించినా అనుకున్నంతగా అమౌంట్ రాకపోవడంతో ఇల్లు అమ్మకాన్ని విరమించుకున్నాడు. ఇతరత్రా ఆస్తులేమి లేకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.