Srinivas Goud | ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
మహబూబ్ నగర్ : బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం పలు డివిజన్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా మెట్టుగడ్డ మార్కెట్ ను పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ పట్టణంలో నిర్మించిన టౌన్ హాల్‌ను ఎందుకు ఓపెన్ చేయడం లేదని, వెయ్యి పడకల ఆసుపత్రిని ఎందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న హరిత హోటల్ ఎందుకు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. శిల్పారామం, ట్యాంక్ బండ్ పరిస్థితి ఏమైందని, మైనారిటీ గురుకులాలు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.
మన్యకాండ రోప్ వేను ప్రారంభించకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో మంచి నీళ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులకు చేత కావడం లేదని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

