బాన్సువాడ రూరల్ : ఉమ్మడి నిజమాబాద్ (Nizamabad) జిల్లాలో కొన్ని రోజులుగా అంత చిక్కని వైరస్ ( Virus) సోకి కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల బాయిలర్ కోళ్లు (Boiler Chickens) మృతి చెందగా తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ గ్రామంలో మంగళవారం కోళ్ల ఫారంలో 2వేల కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను గ్రామ శివారులో జేసీబీల సహాయంతో గుంతలు తవ్వి అందులో పూడ్చిపెట్టారు. వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.