Kotagiri | టాక్లి లో పిడుగు పడి రెండు గేదెలు మృతి
పోతంగల్ మండలం టాక్లీ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగు పడడంతో రెండు గేదెలు మృతి చెందినట్లు బాధితుడు చిక్లే ప్రకాష్ రావు తెలిపారు.
Kotagiri | కోటగిరి, జూన్ 28 : పోతంగల్ మండలం టాక్లీ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగు పడడంతో రెండు గేదెలు మృతి చెందినట్లు బాధితుడు చిక్లే ప్రకాష్ రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం టాక్లి గ్రామంలో చిక్లే ప్రకాష్ రావు ఇంటి సమీపంలో అతనికి చెందిన రెండు గేదెలు కట్టేసి ఉన్నాయి.
సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో రెండు గేదెలు అక్కడిక్కడే మృతి చెందాయని బాధితుడు వాపోయాడు. రెండు గేదెలు కూడా నిండు చూడి ఉన్నాయని ఒక్కో గేదె ధర రూ.90వేలకు పైగా ఉంటుందనీ సుమారు రెండు గేదెలు కలిపి రూ.2 లక్షలు ఉంటుందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. పిడుగుపాటుకు జరిగిన నష్టంకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

