ఆర్టీసీ అధికారుల వినూత్న ప్రచారం
నిజాంసాగర్, మే 28 : పెండ్లిళ్లతో పాటు శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇస్తున్నామని తెలుపుతూ.. బాన్సువాడ డిపో ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం నిర్వహించారు.
ఆర్టీసీ బస్సును పెండ్లికి సంబంధించిన బొమ్మలతో అందంగా అలంకరించి నిజాంసాగర్‌లో శనివారం నిర్వహించిన సంతలో ప్రచారం చేశారు. సంతకు వచ్చిన వారు బస్సును ఆసక్తిగా తిలకించారు.