నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల కేక్ కట్‌చేయగా, పలువురు మొక్కలు నాటారు. కమ్మర్పల్లి రైతువేదిక భవనంలో పార్టీ మండలాధ్యక్షుడు రేగుంట దేవేందర్, ఏఎంసీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, సర్పంచ్ గడ్డం స్వామి తదితరులు కేక్ కట్‌చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. బోధన్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే షకీల్ తన సతీమణి ఆయేషా ఫాతిమా, నియోజకవర్గ నాయకులతో కలిసి భారీ కేక్‌ను కట్‌చేశారు. వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, నాయకులు వి.మోహన్‌రెడ్డి, ఎంఏ రజాక్, తూము శరత్‌రెడ్డి, రవీందర్ యాదవ్, దేరడి శ్రీరామ్, గోగినేని నర్సయ్య, నర్సింగ్‌రావు, భవానీపేట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ముప్కాల్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి కేక్ కట్‌చేసి అన్నదానం నిర్వహించారు. బోధన్‌లోని మహాలక్ష్మీ ఆలయ కల్యాణ మండపంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా బహుమతులను అందజేశారు. టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు వడ్ల సతీశ్‌చారి, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట్ రైతువేదిక వద్ద టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అజయ్‌గౌడ్ తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏర్గట్లలోని కేజీబీవీలో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం విద్యార్థినులతో కలిసి కేక్ కట్‌చేశారు.
బట్టాపూర్ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. నవీపేట మండలంలోని పొతంగల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంపీటీసీ రాజు తదితరులు పండ్లు పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని నీలా, దూపల్లి రైతు వేదిక భవనాల వద్ద టీఆర్ఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, ఏఈవోలు కవిత, భాగ్యశ్రీ, రైతులు సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. బాల్కొండలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్, ఆశ కార్యకర్తలు కేక్ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు.ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో బల్దియా చైర్పర్సన్ పండిత్ వినిత, వైస్ చైర్మన్ షేక్ మున్నా, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మెండోరాలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ పేరిట అర్చన చేయించారు. అనంతరం జడ్పీహెచ్ఎస్లో కేక్ కట్‌చేసి, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. జడ్పీటీసీ తలారి గంగాధర్, ఎంపీపీ బురుకల సుకన్యా కమలాకర్, వైస్ ఎంపీపీ సరస్వతీ రవిగౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సామ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భీమ్‌గల్‌లో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుభోదయం దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ చిరంజీవి కేక్ కట్‌చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు కల్లెడ ఏలియా కేక్ కట్‌చేయగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న తదితరులు పాల్గొన్నారు. సౌదీలో ఉండే లక్కోరా గ్రామస్తులు సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేశారు. అంక్సాపూర్‌లో అన్నదానం నిర్వహించగా.. పచ్చల నడ్కుడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ, శంభుని, గోల్హనుమాన్ ఆలయాల కమిటీల చైర్మన్లు జాలిగం గోపాల్, మల్కాయి మహేందర్, నీలగిరి రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టాటాగూడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మొక్కలు నాటారు. అనంతరం వెలమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్‌రావు, జడ్పీ సీఈవో గోవింద్, తెలంగాణ శంకర్ పాల్గొన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని నవదుర్గా ఆలయ ఆవరణలో కేసీఆర్ జన్మదిన వేడుకలకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ సమావేశపు హాలులో న్యాయవాదులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్నిలో నిర్వహించిన వేడుకల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఐకేపీ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో బషీరుద్దీన్ మొక్కలు నాటారు. రుద్రూర్, చందూర్, మోస్రా, కోటగిరి మండలాల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చందూర్‌లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో పలువురు రక్తదానంచేశారు. మోస్రాలోని ఎంపీపీ పిట్ల ఉమాశ్రీరాములు ఇంటి ఆవరణలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చందూర్‌లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.