RTC Strike | తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా రవాణా స్తంభించిపోయింది. సమ్మె సైరన్తో ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టే పరిస్థితులు ఉండటంతో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి డిపోల వద్దకు చేరుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని.. చర్చలు ఫలించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించడంతో బస్సుల రాకపోకలు స్తంభించిపోయాయి. బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

