బూర్గంపహాడ్, ఆగస్టు 15 : ప్రతి సోమవారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ కుడుముల జమలారెడ్డి శనివారం తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మండలంలోని గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు నేరుగా కార్యాలయంలో సమర్పించవచ్చని చెప్పారు. వినతులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి చర్యలు చేపడతారని వెల్లడించారు. సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజలు నిర్దేశిత సమయంలో సమర్పించాలన్నారు. మండలంలోని ప్రజలందరూ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.