ఖలీల్‌వాడి/కామారెడ్డి, ఫిబ్రవరి 12: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వినాయక్‌నగర్, ఫిబ్రవరి 12: నిజామాబాద్ రేంజ్ పరిధిలోని ఇద్దరు ఎక్సైజ్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఉత్తర్వులు వెలువరించారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ను రంగారెడ్డి డీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్‌ను రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా ట్రాన్స్ఫర్ చేశారు.ఆయన స్థానంలో రంగారెడ్డి -1 టీఎస్‌బీసీఎల్ చీఫ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వి.సోమిరెడ్డిని నియమించారు.