
Pothangal | పోతంగల్, పిబ్రవరి 23 : మజీరా శివారు నుండి ఇసుక అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ట్రాక్టర్ యజమానులు సోమవారం రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక వాహనం యాప్‌లో పోతంగల్ ఇసుక పాయింట్ చూపించడం లేదని, దీంతో ఇసుక రవాణా చేయలేక ఆర్థికంగా సతమతమవుతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు.
మంజీర నుండి అనుమతి పొంది ఇసుక రవాణా చేసి జీవనోపాధి పొందవచ్చని ఫైనాన్స్‌లో ట్రాక్టర్లు తీసుకొని ఇతర మండలాలకు ఇసుక సరఫరా చేసి లబ్ధి పొందేవారమని, రెండు నెలలుగా ఇసుక రవాణా కు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదాలు కట్టలేక కుటుంబాలు పోషించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే మన ఇసుక వాహనం యాప్ ఆన్లైన్లో పోతంగల్ ఇసుక పాయింట్ ఉండేలా చర్యలు తీసుకొని తమ కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు.