ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ ప్రభుత్వంతోనే నెరవేరుతాయని ప్రజలు విశ్వసించారని అన్నారు. ప్రజలకు స్వేచ్ఛ,సమాన అవకాశాలు,సామాజిక న్యాయం అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
ఆరు గ్యారెంటీల కోసం రెండు లక్షల 94వేల 799 దరఖాస్తులు, 13,367 ఇతర సమస్యలపై వినతులు వచ్చినట్లు తెలిపారు. మండల పరిషత్ ఆఫీసులు,మున్సిపల్ కార్యాలయాల్లో 33 ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ ఇందూప్రియ పాల్గొన్నారు.