Armoor | ఆర్మూర్ టౌన్ : నిజామాబాద్ ఆర్మూర్ పట్టణ వాసులకు అలర్ట్.. రేపు (బుధవారం ) నాడు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్మూర్ పట్టణానికి ప్రతిరోజు మిషన్ భగీరథ తాగునీటిని అందించే శుద్ధి కేంద్రం నుంచి ఆర్మూర్ పట్టణానికి నీటిని సరఫరా చసే 50ఎంఎం డైఐ పైపు జాతీయ రహదారి పక్కన గల ఓ గార్డెన్ వద్ద డ్యామేజ్ అయ్యింది. ఈ కారణంగానే తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. ఈ నెల13 నుంచి నీటి సరఫరా యథావిధిగా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ విషయానని పట్టణ ప్రజలు గమనించి, సహకరించగలరని కోరారు.