ఇందల్వాయి, మార్చి 31 : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సవరించిన టోల్‌ప్లాజా చార్జీలు నేటి నుంచి అమలుకానున్నాయని ఇందల్వాయి టోల్‌ప్లాజా మేనేజర్ జలపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కారు, జీపు, వ్యాన్ లేదా తేలికపాటి మోటార్ వాహనానికి 90 రూపాయలు, 24 గంటల లోపు తిరుగు ప్రయాణానికి 130 రూపాయలు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.