ఉమ్మడి జిల్లాలో నేడు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాలను ముస్తాబు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, సుభాష్‌నగర్‌లోని రామాలయం, కామారెడ్డి పట్టణంలోని రైల్వేస్టేషన్ రామమందిరం, గోపాలస్వామి ఆలయాలతోపాటు హనుమాన్ ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.
వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీరాముడి పట్టాభిషేకం, పట్టువస్ర్తాల సమర్పణ, సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఆలయాల్లోని కల్యాణ మండపాలను తీర్చిదిద్దారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.