సుభాష్‌నగర్, ఏప్రిల్ 11 : ఉమ్మడి జిల్లాలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగపూర్ హనుమాన్, గోల్ హనుమాన్, రోకడ్ హనుమాన్, నల్ల హనుమాన్ మందిరంతోపాటు కామారెడ్డి జిల్లాలోని హనుమాన్ ఆలయాలను వేడుకలకు ముస్తాబు చేశారు.
విద్యుత్ దీపాలతో అలంకరించారు. సిందూర పూజలు, వడ, తమలపాకు పూజలు చేయనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు వీరహనుమాన్ విజయయాత్ర, శోభాయాత్ర నిర్వహించనున్నారు.