Arrested | వినాయక నగర్, మే 13; ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని రెండు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం దాడి నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న యాళ్ల రిశ్వాంత్ అనే యువకున్ని అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుండి గ్రా.750 గంజాయి, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
అనంతరం ఆర్మూర్ పట్టణంలో సౌదాలు నిర్వహించగా అక్కడ షేక్ సమీర్, షేక్ కలీం అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 2.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 2 ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 3.050 కిలోల ఎండు గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు మూడు సెల్ ఫోన్ లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ నరసింహ చారి, సిబ్బంది భూమన్న, గంగారాం, విష్ణు, సాయికుమార్ పాల్గొన్నారు.