Collector Ila Tripathi | జిల్లాలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన చెందొద్దు : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు.
Collector Ila Tripathi | ఎడపల్లి, జూన్ 9 : జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు.
రైతులు తప్పనిసరిగా యూరియా యాప్‌ను వినియోగించాలని, యాప్ ద్వారా రైతులకు ఎకరానికి రెండు యూరియా బస్తాల చొప్పున కేటాయింపు ఉంటుందని తెలిపారు. యూరియాను విడతల వారీగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ప్రస్తుతం ఏయే పంటలను సాగు చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గోదాములోని యూరియా నిల్వలను పరిశీలించి స్టాక్ వివరాలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్ నాయక్, వ్యవసాయ అధికారి సిద్ధిరామేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

