నవీపేట, సెప్టెంబర్ 20: విద్యుత్ తీగలు దొంగిలించి పారిపోతున్న దొంగలకు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నవీపేట మండలం ఫత్తేపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నవీపేట మండల కేంద్రంలోని తాడ్గామకు చెందిన సాయిలుకు నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన పవన్‌తో కొన్నినెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ మోటర్ల వద్ద విద్యుత్ వైర్లను దొంగిలించి, వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.
దీనిని వృత్తిగా చేసుకున్న వారు మండలంలోని ఫత్తేనగర్ గ్రామంలో గురువా రం రాత్రి విద్యుత్ తీగలను దొంగిలించి పారిపోతుండగా ..అనుమానం వచ్చి గ్రామస్తులు అడ్డుకున్నారు. చోరీ విషయం తెలియడంతో గ్రామస్తులు వారికి దేహశుద్ధి చేశారు. ఇప్పటివరకు వారు చేసిన చోరీ చేసిన వివరాలను కూడా గ్రామస్తులు రాబట్టి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక ఏఎస్సై మోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకొని దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
మూడురోజుల క్రితం కేబుల్ వైర్ల చోరీ
మూడు రోజుల క్రితం మట్టయ్యఫారం గ్రా మంలోని బదావత్ వసంత్‌కు చెందిన మూడు జెట్ పంపుల విద్యుత్ కేబుల్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించుకొని పారిపోయారు. దీంతోపాటు చుట్టుపక్కల రైతులకు చెందిన కేబుల్ వైర్లను కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు బదావత్ వసంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. మండలంలో కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారా యి. చోరీలను అరిట్టేందుకు పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.