నిజాంసాగర్, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందించేలా, వారికి పట్టాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని వారు పేర్కొంటున్నారు. ఈమేరకు జిల్లాలోని పలు తండాలు, గ్రామాల్లో పోడు పట్టాలను పొందిన రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు.
జుక్కల్‌తోపాటు మండలంలోని సావర్గావ్ గ్రామంలో పోడు భూముల పట్టాలను శుక్రవారం అందుకున్న రైతులు సంబురాలు చేసుకున్నారు. పెద్దకొడప్గల్లో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం జుక్కల్‌లో బీఆర్ఎస్ నాయకులు నీలూపటేల్, సాయాగౌడ్, మాధవ్‌రావు దేశాయ్, సావర్గావ్ సర్పంచ్ పవార్ కిషన్ కలిసి సావర్గావ్ గ్రామానికి చెందిన 27 మందికి పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
పిట్లం మండలంలోని గౌరారంతండాకు చెందిన రైతులకు పోడు భూమి పట్టా పాస్‌పుస్తకాలను సర్పంచ్ రవి, తహసీల్దార్ రామ్మోహన్రావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్.. వారికి పట్టా పాస్‌పుస్తకాలను అందజేసి అండగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో గిర్దావర్ రవీందర్నాథ్, రైతులు పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని పోచారం తండా గ్రామంలో పోడు భూముల పట్టాదారులు, తండా ప్రజలు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ హరిసింగ్ మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందించేలా సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో బాన్సువాడ నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న గిరిజనులందరికీ పోడు భూముల పట్టాలు రావడం హర్షణీయమని అన్నారు. సీఎం కేసీఆర్‌కు, స్పీకర్‌కు గిరిజనులు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, బలరాం, శ్రీనూనాయక్, ప్రకాశ్, అంబర్‌సింగ్, రంజ్యా నాయక్, ఫకీరా నాయక్ తదితరులు పాల్గొన్నారు.