బీర్కూర్, జనవరి 7: బీర్కూర్ మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలకేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం అథితిగృహంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనుల కోసం రూ. 100 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి పనులు బాన్సువాడ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల్లో వెనుకాడరాదని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా తీసుకువస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీలకతీతంగా పారదర్శకంగా పను లు చేసి పెట్టాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బాన్సువాడ నియోజకవర్గం ముందంజలో ఉన్నదని సభాపతి తెలిపారు.
సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్, ఎంపీపీ రఘు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ద్రోణవల్లి అశోక్, రైతుబంధు సమితి కన్వీనర్ అవారి గంగారాం, ఎంపీటీసీ సందీప్, దుంపల రాజు, కొరిమె రఘు, కమ్మ సత్యనారాయణ, అప్పారావ్, నర్సరాజు, లాడేగాం గంగాధర్, పుల్లెని బాబురావు, నర్ర సా యిలు, పోగు నారాయణ, అబ్దుల్ హైమద్, లక్ష్మీరమేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.