Kotagiri | కోటగిరి, జనవరి 25 : ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఒక పవిత్రమైన ఆయుధం అని కోటగిరి తహసీల్దార్ గంగాధర్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి కోటగిరి బస్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి అధికారులు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పడిడ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాధర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడు తమ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఓటరుగా నమోదు చేసుకొని తప్పనిసరిగా ఓటు వేయాలని, ఈ చర్య దేశ భవిష్యత్‌ను మార్చగలదన్నారు. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యంలో పాల్గొనడం ఒక బాధ్యతని పేర్కొన్నారు. ఒక్క ఓటుతో ఏమవుతుందని అనుకోవద్దని, తమ భవిష్యత్తును మార్చి శక్తి ఒక్క ఓటుకే ఉందన్నారు.
కాబట్టి ప్రతీ ఒక్కరూ 18 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరూ వారు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు వచ్చిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ఎస్సై సునీల్, ఇన్చార్జి హెడ్మాస్టర్ బర్ల సాయిలు తదితరుల పాల్గొన్నారు.