గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ గణిత దినోత్సవాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. రాజంపేట మండలం తలమడ్ల జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులు రంగురాళ్లతో రూపొందించిన రామానుజన్ చిత్రం ఆకట్టుకున్నది.