‘గణతంత్ర’ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకకు ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఇదివరకే నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు.
‘గణతంత్ర’ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పోలీసు పరేడ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. కోర్టులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో రిపబ్లిక్ వేడుకలు నిర్వహించనున్నారు.