Sirikonda | సిరికొండ, మార్చ్ 13 : వేసవిలో ప్రజల దాహర్తీ తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సిరికొండ ఎంపీడీవో మనోహర్ రెడ్డి అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని పోచమ్మ చౌరస్తా వద్ద ఉపసర్పంచ్ గ్యామ శోభన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పలు సెంటర్లో దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల ద్రాహం తీర్చడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీసీ చైర్మన్ స్వామి, గంగాధర్, రాము, దిగంబర్, జగన్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.