కమ్మర్పల్లి, మార్చి 1 : మేడిగడ్డ బరాజ్‌కు చెందిన కేవలం మూడు పిల్లర్లు స్వల్పంగా కుంగిపోతే ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. చలో మేడిగడ్డలో భాగంగా ఆయన బరాజ్‌పై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. పిల్లర్లకు మరమ్మతులు నిర్వహిస్తూనే సాగునీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కావాలనే కేసీఆర్ చేసిన మంచి పనులను కనుమరుగు చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
కేసీఆర్ చేసిన పనులకు సంబంధించి ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. సుమారు రూ. 80వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నిర్మాణానికి అయిన ఖర్చు రూ. 3వేల 500కోట్లు ఉంటుందని.. ఇందులో మూడు పిల్లర్ల మరమ్మతులకు సుమారు రూ. 3-4 వందల కోట్లు కావచ్చన్నారు. మిగతా పిల్లర్లు, డ్యామ్, వంతెన దృఢంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా నిర్మించిన కాళేశ్వరం పూర్తిగా వేస్ట్ అంటూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం, మంత్రులే ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలకు తండ్రిలా ఉండాలి తప్ప ఇలా చేయకూడదన్నారు.