రాజంపేట : తెలంగాణలో ఏ ఎన్నికలు నిర్వహించినా తెలంగాణ ప్రజలు బీజేపీ ( BJP) కి అనుకూలంగా ఉన్నారని రాజంపేట బీజేపీ మండల అధ్యక్షులు సావుసాని సంపత్ రెడ్డి అన్నారు. మెదక్( Medak) , నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ( MLC ) గా అంజి రెడ్డి, మల్కా కొమురయ్యను గెలిపించినందుకు మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనందించిన గ్రాడ్యుయేషన్( Graduation) ఓటర్లకు , బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ ప్రజలు బీజేపీకి పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ గంగారెడ్డి, సీనియర్ నాయకులు పిట్ల శీను, బీజేవైఎం అధ్యక్షులు సతీష్ రెడ్డి, బల్ల కిషోర్, గ్రామ అధ్యక్షులు రాము, సాయి రెడ్డి, రాజిరెడ్డి, అరుణ్ గౌడ్, కమ్మరి నాగరాజు, బాలయ్య, సంతోష్, బాల నర్సు, కార్యకర్తలు పాల్గొన్నారు.