పోతంగల్ ఆగస్టు 12 : జాతీయ కుటుంబ సంక్షేమ పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ గంగాధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద ప్రభుత్వం నుండి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు.
కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి జాతీయ కుటుంబ సంక్షేమ పథకం ఎన్.ఎఫ్.బీ.ఎస్ వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకొని తహసీల్దార్ కార్యాలయంలో పత్రాలు అందజేయాలని తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ పథకం ద్వారా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారై ఉండి కుటుంబాన్ని పోషిస్తున్న వారు మరణిస్తే రూ.20 వేల రూ.సహాయం అందుతుందన్నారు.