Pending Bills | సిరికొండ, ఏప్రిల్ 17 : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం బాలయ్య డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం ప్రదర్శించి తహసీల్దార్ రవీందర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీఈ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మధ్యాహ్న భోజనం విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టినట్లు తెలిపారు.
ప్రధాన డిమాండ్స్ అయిన తెలంగాణ 2వ పీఆర్సీని శివ శంకర్ కమిటీ నుండి తెప్పించుకొని 51% ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని, 13వేల పై చిలుకు ఉన్న ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఏక మొత్తంలో ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ మేరకు కంటిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) లో అమలు చేయాలని, ప్రభుత్వం ముందు వచ్చిన 63 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.