Bodhan | బోధన్: క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూదోట రవికిరణ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పరుచూరి నగేష్ బాబు ఉద్యోగవిరమణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
నగేష్ బాబు సమయపాలనకు క్రమశిక్షణకు మరోపేరని, తన సర్వీస్ కాలంలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని ఆయన అన్నారు. బోధన్ ఎంఈవో నాగయ్య మాట్లాడుతూ నగేష్ బాబు ఉపాధ్యాయులకు ఆదర్శమని, పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా నగేష్ బాబు-వసుంధర దంపతులను అతిథులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్, బోధన్ జేఏసీ చైర్మన్ పీ గోపాల్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బోధన్ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి, బోధన్ మాజీ వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు ఎంబెల్లి శంకర్, మోహన్, హైస్కూల్ హెచ్ఎం బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.