నందిపేట్: నిజామాబాద్ (Nizamabad) నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి ఉచితంగా టీ షర్టులను అందజేశారు. పాఠశాలలోని 48 మంది విద్యార్థులకు సుమారు రూ.15 వేలు విలువచేసే టీ షర్ట్‌లను కొనుగోలు చేసి విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రనగర్ గ్రామానికి చెందిన అంజయ్య గురుస్వామి, ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్, ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ పాల్గొన్నారు.