ఇందల్వాయి, సెప్టెంబర్ 8 : చెక్‌డ్యాంను చూసేందుకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మనోజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి గుర్రాల ప్రశాంత్ (30) ఎల్లారెడ్డిపల్లి శివారులోని తన పొలం వద్దకు వెళ్లా డు.
పొలం పక్కనే ఉన్న చెక్‌డ్యాంను చూసేందుకు వెళ్లగా..ప్రమాదవశాత్తు కాలుజారి చెక్‌డ్యాంలో పడ్డాడు. మృతుడు ఉపాధి నిమిత్తం కొన్నేండ్ల పాటు గల్ఫ్‌లో ఉండి రెండు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. పొలాల వద్ద ఉ న్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.