POTHANGAL | పోతంగల్, నవంబర్ 20 : చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బోదన్ డివిజన్ షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ ఆశన్న, సునీత సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం షీటీం సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళల భద్రత కోసమే షీ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
విద్యార్థులను ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. లోన్ యాప్‌లు, మొబైల్ ఫోన్లలో వచ్చే ఫేక్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాయిలు, ఉపాధ్యాయులు నాగ్ నాథ్, కోటగిరి పోలీస్ సిబ్బంది అనురాధ, ఇలియాజ్ అలీ, గంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.