నస్రుల్లాబాద్, నవంబర్ 13 : సకాలంలో బస్సులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు బీర్కూర్‌లో బుధవారం ధర్నాకు దిగారు. బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కిష్టాపూర్ గ్రామ విద్యార్థులు బీర్కూర్-పొతంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు.
సకాలంలో బస్సులు రాక పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్నామని, పాఠాలు సరిగా వినలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు. సాయంత్రం సమయంలోనూ బస్సుల్లేక ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతున్నదని వాపోయారు. బస్సులు రాక రోడ్లపై పడిగాపులు కాయాల్సివస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సకాలంలో బస్సులు నడపాలని కోరారు.