Nizamabad | భిక్కనూరు ఏప్రిల్ 21 : పట్టణ ప్రాంత విద్యార్థుల కంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం ను ఆయన సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, ప్రేరణ కలిపిస్తూ కొంత సేపు ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ సమస్యలను దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారం కోసం ఇటు వీసీ తోనూ అటు ప్రభుత్వంతోనూ మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, హాస్టల్ వార్డెన్లు డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.