Inter result | కామారెడ్డి : ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిన ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిక్నూర్ గ్రామానికి చెందిన రెడ్డి గంగవ్వ కొడుకు చనిపోయాడు. కాగా ఆ కొడుకుకు పూజ అనే కూతురు (17) ఉంది. కాగా ఆమెను గంగవ్వ సాకుతోంది.
పూజ ఇంటర్ చదువుతోంది. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పూజ ఫెయిలైంది. దీంతో మనస్థాపంతో బుధవారం ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకును నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా అయితే గంగవ్య మంగళవారం తన కూతురు ఊరైన దేవునిపల్లికి వెళ్లడంతో గమనించిన కుటుంబీకులు గంగవ్వకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన గంగవ్వ తన ఇంటికి తరలివచ్చింది.
అప్పటికే మృతి చెందిన మనవరాలని చూసి బోరున విలపించింది. గంగవ్వ ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కునూరు ఎస్సై డీ ఆంజనేయులు తెలిపారు.